మీరు పెన్ను పట్టుకునే విధానమే మీ క్యారెక్టర్ చేప్పేస్తుంది.. అది ఎలా అంటే?
ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా ఉంటారు. కొందరి స్వభావం చాలా సున్నితంగా ఉంటే మరి కొందరు చాలా కోపంగా, ఎప్పుడూ చిరాకుగా కనిపిస్తుంటారు. ఇంతే కాకుండా నడవడిక, ప్రవర్తన ఇలా అన్నింటిలోనూ ఒకొక్కరూ ఒక్కో రకంగా ఉంటుంటారు. అయితే ఒక వ్యక్తి క్యారెక్టర్ అంత ఈజీగా చెప్పలేం. కానీ వారు పెన్ను పట్టుకునే విధానమే తమ మనస్తత్వం చెబుతుంది అంటున్నారు నిపుణులు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
చూపుడు వేలు,మధ్య వేలుతో పెన్నుపట్టుకునే వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారంట. అంతేకాకుండా వారు ప్రతి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచడానికి ఎక్కువ ఇష్టపడుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారంట.
బొటన వేలు ముందుకు ఉంచి పెన్ను పట్టుకునే వారు ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభవిస్తారంట. వీరు తమకు సహాయం చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు, అలాగే వీరు ఎక్కువ భావోద్వేగానికి లోను అవుతారు.
బొటన వేలు, చూపుడు వేలు మధ్య పెన్ను పట్టుకునే వ్యక్తులు చాలా దయగల వారంట. వీరు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోరు.ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
చూపుడు వేలు మధ్య వేలుతో పెన్ను పట్టుకునే వ్యక్తులు ఇతరులను ఎక్కువ ఆకర్షిస్తారు. వీరు ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తారు. అంతే కాకుండా అబద్ధాలు ఆడటానికి ఇష్టపడరు. నిజాయితీగా ఉంటారు.
బొటన వేలును నిటారుగా ఉంచి పెన్ను పట్టుకునే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఎప్పుడూ నవ్వుతూ చాలా సంతోషంగా ఉంటారు.
Life and Challenges by Dr.Kasigari Prasad
జీవితంలో మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటాం.
కొన్ని సార్లు ఆ ప్రక్రియలో తప్పులు చేస్తూ ఉంటాం.
కానీ చేసిన తప్పులు తెలుసుకోవాలే కానీ లక్ష్యం వైపు మనం చేసే ప్రయాణం ఆగకూడదు.
నిజమైన ఎదుగుదల ఎప్పుడు సాధ్యమంటే, మనం చేసే పనులు తెలియకపోవడం తప్పుకాదు,నేర్చుకోకపోవడం తప్పు.
భయపడటం తప్పు కాదు, భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు.
లోపాలు ఉండటం తప్పుకాదు, వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు.
మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో …
ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ…
తప్పులు తెలుసుకుంటూ…
గుణపాఠాల నుంచి నేర్చుకుంటూ…
అందులో మెరుగవుతూ…
ఉంటేనే
జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.
జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే.
కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది.
కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది.
మనసుకు తగిలే దెబ్బ ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది.
బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే,
జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కొవాలో నేర్పిస్తుంది.
The Power of Words
పుట్టిన సమయాన మాట రాదు
మరణ సమయంలో మాట పడిపోతుంది
“అందుకే”
మాటల్లో పొదుపు , ఆలోచనలలో అదుపులో
దాగుంది మనిషి విలువ.
మాటతో ఎదుటివారిని బతికించవచ్చు
మాటతో చంపనూవచ్చు
“అందుకే”
మాట పదునైన ఆయుధం…
ఆత్మీయతా చూపులు
వెన్నెల కిరణాలగా … ప్రసరిస్తూ మాట్లాడటం
మనసుకు ఆహ్లాదం … శరీరానికి ఆరోగ్యకరం….
అందుకే
మాట్లాడటం ఓ తపస్సు….
బంధాలు , అనుబంధాల నడుమ
మాటే అలంకారం…
మనసుకి మనసుకి మద్య
పురివిప్పిన భావానికి మాటే ప్రాణం….
అందుకే
మానవ జన్మకు
మాటే మంత్రం.
Nene Kavithanu…
నేనే… కవితని
___________________________
కాగితము పైన
కాలక్షేపానికి వ్రాసేది
కాదన్నది కవిత…
మనసులో ఆపేక్షంగ
తడుముతుంది లాలనగ..
నన్ను వ్రాయమని,
సాపేక్షమైన ఘాఢతైన
బరువైన ఊహలు వెంట బెట్టుకొని…
నన్ను స్పృశిస్తే
నీకు క్రొత్త అనుభూతి కలిగిస్తాను
అంటుంది ఆప్యాయంగ…
ఆరాధ్యతను పెంచి,..
నీకు రసానుభూతిని అందిస్థానంటుంది సంతోషంగ…
నీలో నిర్మలత్వాన్ని పెంచి
మనసును శాంత పరచి
అలౌకిక ఆనందాన్ని కలగ జేస్తానంటుంది…
ప్రపంచాన్ని పరిచయము చేసి
నీకు, చదవాలనే ఉపేక్ష తప్పా
వితండ వాదన వద్దంటుంది సౌమ్యంగా..
సమాజంలోని అస్పృశ్యత,
కుళ్ళిన ఆలోచనలు,
వికటిత సాంప్రదాయాలను
తూర్పార బట్టి,
ప్రక్షాళన చేస్తానంటుంది గంభీరంగ…
మదిలో అంతర్గ తంగ
ఎక్కడో దాగిన
ఆత్మీయతను వెదికి తీసే
ప్రహర ణము నేనే అంటుంది వినమ్రంగ…
నీలో ఉన్న సుగుణాలను
నేను గుణకారము చేసి
నీ ముందు ఆవిష్కరించడమే గాక
నీపై సద్విమర్శ చేసే
సమయాన్ని నేనే
సమాజంలో నిన్ను ఉన్నతున్ని చేసి
‘నీ’ స్థాయిని పెంచి,
నిన్ను తీర్చి దిద్ద గలను అంటుంది ప్రౌఢంగ…
నీకు బంధాలను కలిపే హితున్ని నేనే,
ప్రేమను జనింప జేసి
అనుబంధాలను పెనవేయగలను
భావోద్వేగాలతో అలసిన హృదయానికి
హృద్యమైన ఆలంబణ నేనే
అవుతానంటుంది ఆప్యా యంగా…
నీవు నాతో మనసు విప్పి మాట్లాడితే
నిజమైన తోడు నేనే అవుతానంటుంది..
నీ జీవిత ప్రయాణములో
నీకు నిజమైన మార్గదర్శనీ నేనే..
నీ..నేస్తాన్ని అంటుంది…
నేనే నీ కవితను
నీ ఆత్మ ప్రతిరూపాన్ని,
నీ నేస్తాన్ని…
– Naa Kavanam
“నా కవనం”
అక్షరాన్ని
ఆయుధంగా చేసుకుని
అణువణువూ
చైతన్యం నింపుకొని..
వినూత్న ఆలోచనలతో
విజ్ఞాన సుగంధాన్ని
విశ్వవ్యాప్తం చేస్తూ
నడిచే కాలానికి
పొడిచే పొద్దు
“నా కవనం”…!!
వాస్తవాల రూపం
మనోఫలకంపై చిత్రించి
పదాలతో
కన్నీటిని తుడిచి….
విలక్షణ భావాలతో
చిమ్మ చీకటి కమ్మిన
బ్రతుకు వాకిట
చిగురించే చిరుదీపం
“నా కవనం”….!!
తెగిపోతున్న అనుబంధాలు, అసమానతలతో
నిశ్శబ్ద గమనం చేస్తూ
నడుస్తున్న చరిత్రలో….
విచక్షణ వ్యక్తిత్వాన్ని
బతుకు మూలాలుగా
చేసుకొని
సమాజ శ్రేయస్సుకై
ఉదయించే నవ్య ఉషస్సు
నా కవనం….!!
అనునిత్యం
విశ్వమానవ కళ్యాణం కోసం…
కాలం సాక్షిగా
కళామతల్లికి
అక్షరాభిషేకంతో
అర్చన చేస్తున్న….
అఖండ చేతనా జ్వలిత
“నా కవనం”….!!